Hyderabad, జనవరి 26 -- Rakshasa Trailer Released In Telugu: కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాక్షస. ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు.

గతంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన వేద చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ రాక్షస తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో రాక్షస భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాక్షస ప్రమోషన్స్‌లో జోరు పెంచారు.

అందుకే తాజాగా శనివారం (జనవరి 25) రాక్షస మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ప్రజ్వల్ దేవరాజ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. కూతురుపై ఉన్న ప్రేమతో ఇందులో హీరో చేసిన చర్యలు స...