Hyderabad, ఫిబ్రవరి 19 -- Rajkumar Rao: రాజ్ కుమార్ రావ్.. బాలీవుడ్ తోపాటు ఇండియాలో ఉన్న విలక్షణ నటుల్లో ఒకడు. సహజమైన నటనతో అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి అతడు. కానీ అలాంటి నటుడు కూడా మూస కథలకే పరిమితమైపోయాడంటూ ఓ ఇన్‌స్టాగ్రామ్ కమెడియన్ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా వస్తున్న భూల్ చూక్ మాఫ్ నుంచి అంతకుముందు విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో, స్త్రీ2, హమ్ దో హమారే దో, రూహిలాంటి సినిమాలన్నింటిలోనూ అతడు చిన్న పట్టణం నుంచి సాధారణ యువకుడి పాత్రలే పోషించాడు.

తాజాగా భూల్ చూక్ మాఫ్ మూవీ టీజర్ రాగానే అక్షత్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ కమెడియన్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దేశంలో బెస్ట్ యాక్టర్ కూడా ఇలా ఒకే తరహా పాత్రలకు పరిమితమైపోతే ఎలా అని అతడు ప్రశ్నించాడు. "ఎందుకంటే వేరే కథే లేదు వినడానికి. సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ లాంటి జానర్ల...