భారతదేశం, ఏప్రిల్ 12 -- Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భారీ రాయితీలపై రుణసదుపాయం కల్పిస్తుంది. ఇందుకోసం రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తుంది. అయితే రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియలో సాంకేతి సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్‌ లోపాలు, సాంకేతిక ఇబ్బందులతో దరఖాస్తుల ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఇంటర్నెట్‌, మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు పడిగాపులు కాస్తున్నారు. కొన్నిసార్లు దరఖాస్తు చివరి దశకు వెళ్లిన తర్వాత సర్వర్‌ లోపాలతో మళ్లీ మొదటికి వస్తున్న దాఖలాలు ఉన్నాయి.

దీంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్‌ ఫారం డౌన్‌లోడ్ కావడం లేదని చెబుతున్నారు. తిరిగి మళ్లీ దరఖాస్తు చేస్తే అల్రెడీ అప్లై చేసినట్లు వస్తుందని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....