భారతదేశం, మే 1 -- Rajinikanth Biopic: తమిళ సూపర్ స్టార్, సీనియర్ హీరో రజినీకాంత్ జీవితం చాలా స్ఫూర్తిదాయకం. బస్ కండక్టర్ నుంచి కోట్లాది మంది అభిమానించే, ఆరాధించే సూపర్‌స్టార్‌గా ఆయన ఎదిగారు. రజినీ జీవితం ఆధారంగా బయోపిక్ వస్తుందంటూ కొంతకాలంగా సమాచారం వినిపిస్తోంది. ఇప్పుడు, ఆ దిశగా ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. రజినీకాంత్ బయోపిక్ రూపొందించేందుకు హక్కులను బాలీవుడ్ నిర్మాత, రచయిత సాజిద్ నడియాడ్‍వాలా సొంతం చేసుకున్నారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

రజినీకాంత్ బయోపిక్ హక్కులను నిర్మాత సాజిద్ నడియాడ్‍వాలా దక్కించుకున్నారని బాలీవుడ్ హంగామా రిపోర్ట్ వెల్లడించింది. ఇందుకుగాను బయోపిక్ నిర్మించేందుకు రజినీతో కాంట్రాక్టుకు సాజిద్ సంతకం చేశారట.

రజినీకాంత్ బయోపిక్ స్క్రిప్ట్ పనులను సాజిద్ స్వయంగా చూసుకుంటారని ఆ రిపోర్ట్ పేర్కొంది. "నటుడిగానే ...