భారతదేశం, మార్చి 24 -- రాబిన్‍హుడ్ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో క్యామియో రోల్ చేశారు. ఐపీఎల్‍తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన వార్నర్.. టాలీవుడ్‍తోనే తెరంగేట్రం చేస్తున్నారు. తెలుగు చిత్రాలను ఎక్కువగా ఇష్టపడే ఆయన పుష్ప సినిమా స్టెప్‍లు, మూమెంట్లను చాలాసార్లు చేశారు. ఇప్పుడు వెండితెరపై కనిపించబోతున్నారు. రాబిన్‍హుడ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు వార్నర్ హాజరయ్యారు. అయితే, ఈ ఈవెంట్‍లో వార్నర్‌పై అభ్యంతకరమైన కామెంట్లు చేశారు సీనియర్ యాక్టర్,నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్.

డేవిడ్ వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ తిట్టు కూడా అన్నారు. ఈ డేవిడ్ వార్నర్ క్రికెట్ ఆడవయ్యా అంటే.. పుష్పలా యాక్షన్ చేశారని చేసి చూపించారు రాజేంద్ర ప్రసాద్. "దొ**మ...