భారతదేశం, ఫిబ్రవరి 4 -- Rajanna Siricilla Aghori: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఘోరీ చేసిన హంగామా పోలీసుల్ని పరుగులు పెట్టించింది. వేములవాడలో దర్గా కూలుస్తానంటూ వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని టోయింగ్ వ్యాన్ తో హైదరాబాద్ తరలించారు.

సిరిసిల్లలో అఘోరి మరోసారి హల్చల్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులను హైరానాకు గురి చేసింది. వేములవాడకు బయలు దేరిన అఘోరిని తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకు దిగారు. రోడ్డుపై కారు నుంచి బయటకు రాకుండా డోర్ తీయకుండా అద్దాలు దించకుండా కారులోనే అఘోరి ఉండడంతో పోలీసులు టోయింగ్ వ్యాన్ తో హైదరాబాద్ కు తరలించారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని దర్గాను ఫిబ్రవరి 3న కూల్చివేస్తానని ఇటీవల నాగసాధు అఘోరి ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ లో గత నాలుగైదు రోజులుగా తిరిగిన అఘోరీ హైదరాబా...