భారతదేశం, ఆగస్టు 3 -- డాక్యుమెంటరీ: మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి

ఓటీటీ: నెట్‍ఫ్లిక్స్, ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్

ఎడిటర్: సంయుక్త కాజా, సంగీతం: రోహిత్ కులకర్ణి

దర్శకులు: రాఘవ్ ఖన్నా, తన్వి అజింక్య

బాహుబలి చిత్రాలతో తెలుగు సినిమాను దేశవ్యాప్తం చేశారు దర్శక ధీరుడు, గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ రేంజ్‍కు ఎదిగారు. అంతర్జాతీయంగా భారత సినీ ఇండస్ట్రీకి ఆయనే ముఖంగా ఉన్నారు. హాలీవుడ్‍లోనూ రాజమౌళి పేరు మార్మోగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్.. రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీని తీసుకొస్తోందనగానే చాలా హైప్ క్రియేట్ అయింది. ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు స్ట్రీమింగ్‍కు వచ్చింది. మరి ఇది ఎలా ఉందంటే..

ప్రముఖ సినీ జర్నలిస్ట్ అనుపమ చోప్రా చేసిన ఇంటర్వ్యూలతో ఈ డాక్యుమెంటరీ సాగింది. రాజమౌళితో...