భారతదేశం, ఫిబ్రవరి 27 -- దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ వివాదంలో చిక్కుకున్నట్టే కనిపిస్తోంది. ఆయన క్లోజ్ ఫ్రెండ్ యు.శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని, రాజమౌళినే అందుకు కారణంగా అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. గతంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని, ఇప్పుడు రాజమౌళి తనను టార్చర్ చేస్తున్నారంటూ పేర్కొన్నారు.

తనది, రాజమౌళిది 34 ఏళ్ల స్నేహం అని ఆ వీడియోలో శ్రీనివాసరావు తెలిపారు. ఓ అమ్మాయిని రాజమౌళి, తాను ప్రేమించామని, తమది ఆర్య 2 లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అన్నారు. అప్పట్లో అమ్మాయిని త్యాగం చేయాలని రాజమౌళి అడిగితే.. తాను ముందు అంగీకరించలేదని తెలిపారు. అయితే, ఆ తర్వాత తానే త్యాగం చేశానని అన్నారు. ఇది శాంతినివాసం సీరియల్ కంటే ఇది ముందు జరిగిన విషయమని తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో కాబట్టి ఇబ్బంది ఉండకూడదని తాను అలా చ...