భారతదేశం, ఫిబ్రవరి 16 -- Rajahmundry Mumbai Airbus : రాజమండ్రి-ముంబాయి ఎయిర్‌బస్‌కు తాత్కాలిక బ్రేక్ ప‌డింది. ఎయిర్‌బస్‌ను రాజమండ్రి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు మళ్లించారు. ఈ బ్రేక్ 14 రోజుల పాటు ఉంటుంద‌ని, తాత్కాలికంగా ఈ సర్వీస్ నిలిపివేసిన‌ట్లు రాజ‌మండ్రి ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి మ‌ళ్లీ ఎయిర్‌బ‌స్ స‌ర్వీస్‌ను పున‌రుద్ధరిస్తామ‌ని పేర్కొన్నారు.

రాజ‌మండ్రి ఎయిర్‌పోర్టు నుంచి గ‌తంలో హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరుకు మాత్రమే విమాన స‌ర్వీసులు ఉండేవి. అయితే ఆ త‌రువాత రాజ‌మండ్రి నుంచి ఇత‌ర న‌గ‌రాల‌కు కూడా క‌నెక్టివిటీ పెరిగింది. రాజ‌మండ్రి ఎయిర్‌పోర్టు నుంచి కొత్తగా దిల్లీ, ముంబాయి వంటి న‌గ‌రాల‌కు విమాన స‌ర్వీసులు ప్రారంభ‌మ‌య్యాయి. ఇండిగో సంస్థ రాజ‌మండ్రి నుంచి ఢిల్లీ, ముంబాయి వంటి న‌గ‌రాల‌కు ఎయిర్ బ‌స్సుల‌ను ప్రవేశ‌పెట్టింది....