భారతదేశం, ఫిబ్రవరి 5 -- Rajahmundry Forest Fire : రాజమండ్రి రిజర్వు ఫారెస్టులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫారెస్టులో వందలాది చెట్లు కాలి బూడిదయ్యాయి. మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే బ‌త్తుల బ‌లరామ‌కృష్ణ ఫారెస్టు ప్రాంతానికి చేరుకుని, అటవీ శాఖ అధికారుల‌తో చ‌ర్చించారు. అగ్ని ప్రమాదానికి గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు.

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రికి స‌మీపంలో దివాన్ చెరువు రిజ‌ర్వు ఫారెస్టులో మంగ‌ళ‌వారం సాయంత్రం అగ్ని ప్రమాదం జ‌రిగింది. పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. జాతీయ ర‌హ‌దారిని ఆనుకుని గైట్ ఇంజినీరింగ్ కాలేజీల‌కు ఎదురుగా ఉన్న ఉన్న బ్రిడ్జి కౌంటీకి వెనుక భాగంలో జ‌రిగిన ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలోని ఒక్కసారిగా మంట‌లు చెల‌రేగాయి. మంటలు ఉవ్వెత్తున లేచాయి. ఆకాశంలో ద‌ట్టమైన పొగ‌లు క‌మ్మేయ‌డంతో రాజ‌మ‌హేంద్రవ‌రం న‌గ‌ర‌, ...