భారతదేశం, అక్టోబర్ 5 -- భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దేశంలోని పలు ప్రాంతాలకు తాజా వాతావరణ అంచనాలు, హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా దిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, హిమాచల్‌లో భారీ వర్షాలు, అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న 'శక్తి' తుపాను నేపథ్యంలో మహారాష్ట్రకు ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి. అటు చెన్నైలో కూడా వర్షాలు కురుస్తున్నాయి.

ఐఎండీ అంచనా ప్రకారం.. దిల్లీలో ఆదివారం నుంచి అక్టోబర్ 7 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 6 కోసం యెల్లో అలర్ట్ జారీ అయింది. అయితే తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు!

బిహార్, ఉత్తరప్రదేశ్: ఈశాన్య బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లలో నైరుతి రుతుపవనాల ప్రభావం చురుకుగా ఉంది. ఇక్కడ శుక్ర, శనివారాల్లో 210 మిల్లీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ ...