భారతదేశం, ఏప్రిల్ 19 -- Railway Staff rescue: Inter పరీక్షల్లో ఫెయిలయ్యాననే Exams Fail మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన బాలుడిని రైల్వే TTE కాపాడారు. ఆత్మహత్య ఆలోచనతో ఇంటి నుంచి పారిపోయిన మైనర్ బాలుడిని రక్షించారు.

రైలు నెం. 17210 కాకినాడ టౌన్-బెంగళూరు రాజమండ్రి రైలులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిర్యాదు అందగానే రైల్వే సిబ్బంది వేగంగా స్పందించడంతో బాలుడిని సురక్షితంగా కాపాడారు. ఏప్రిల్ 17వ తేదీన జరిగిన ఘటనలో రైల్వే ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (TTE) చొరవతో ఈ ఆపరేషన్ ముగిసింది.

కాకినాడ టౌన్‌లో నివాసం ఉంటున్న 17 ఏళ్ల మైనర్ బాలుడు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ కావడంతో బుధవారం సాయంత్రం 16.30 గంటల సమయంలో తల్లిదండ్రులను చనిపోతానని బెదిరిస్తూ ఇంటి నుంచి పారిపోయాడు.

కొడుకు ఇంటి నుండి పారిపోవడంతో తల్లిదండ్రులు, బంధ...