భారతదేశం, ఏప్రిల్ 8 -- మీరు టెన్త్-ఐటీఐ ఉత్తీర్ణత సాధించి రైల్వేలో రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. మీకు గుడ్‌న్యూస్. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్) ఆర్ఆర్సీ నాగ్‌పూర్ డివిజన్ టెన్త్ పాసైన యువతకు బంపర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ రైల్వే 1007 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు ప్రక్రియ 5 ఏప్రిల్ 2025 నుండి ప్రారంభమైంది. apprenticeshipindia.gov.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి మీ దరఖాస్తు ఫారాన్ని సమర్పించండి. దరఖాస్తుకు చివరి తేదీ 4 మే 2025. అలాగే దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 4 మే 2025 అని గుర్తుంచుకోండి.

ఈ నియామక ప్రక్రియ ద్వారా అభ్యర్థులను వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులకు నియమిస్తారు. అభ్యర్థుల కనీస వయస్సు గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు. అభ్యర్థుల వయస్సును 2025 ...