భారతదేశం, సెప్టెంబర్ 10 -- సెంట్రల్​ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో (సెప్టెంబర్​ 11) ముగుస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే, ఆర్‌ఆర్‌సీ సీఆర్‌ అధికారిక వెబ్‌సైట్ rrccr.com ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రైల్వే రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 2418 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సెంట్రల్​ రైల్వే అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​ 2025 కోసం గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఈ కింద సూచనలను పాటించవచ్చు:

స్టెప్​ 1- ముందుగా, ఆర్‌ఆర్‌సీ సీఆర్‌ అధికారిక వెబ్‌సైట్ rrccr.com ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీ...