ఆంధ్రప్రదేశ్,శ్రీకాకుళం, ఫిబ్రవరి 18 -- చ‌ర్ల‌ప‌ల్లి-శ్రీ‌కాకుళం రోడ్డు-చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య స్పెష‌ల్ రైలు న‌డుపుతున్న‌ట్లు వాల్తేర్ డివిజన్ సీనియ‌ర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. చర్లపల్లి - శ్రీకాకుళం స్పెషల్ ఎక్స్‌ప్రెస్(రైలు నెంబ‌ర్ 07025) ఫిబ్రవరి 21న రాత్రి 21.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్క‌డి నుంచి ఉద‌యం 9.47 గంటలకు బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్‌కు మ‌ధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంటుంది.

శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి స్పెషల్ ఎక్స్‌ప్రెస్(రైలు నెంబ‌ర్ 07026) ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 2.15 గంటలకు శ్రీకాకుళం రోడ్ నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 4.45 గంటలకు దువ్వాడ చేరుకుని. అక్క‌డి నుంచి సాయంత్రం 4.47 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉద‌యం 6.00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ రెండు...