భారతదేశం, డిసెంబర్ 9 -- Rahu Transit in 2026: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. 2025 పూర్తి కాబోతోంది, త్వరలోనే 2026 రాబోతోంది. కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలని, అన్నీ కలిసి రావాలని అందరూ కోరుకుంటారు. అయితే రాహు కారణంగా కొత్త సంవత్సరంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

2026లో రాహువు రెండుసార్లు సంచారం చేస్తాడు. ఇది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. రెండు సార్లు రాహువు సంచారం చేయడంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశుల వారు చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.

2026లో ఆగస్టు 2న రాహువు ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత డిసెంబర్ 5న మకర రాశిలో...