భారతదేశం, జనవరి 28 -- Rahat Fateh Ali Khan Hits Student Video Viral: పేరుకు ఎంతో గొప్ప సెలబ్రిటీలు అయిన ఒక్కోసారి అనుచితంగా ప్రవరిస్తుంటారు. ఒక్కోసారి వారి చర్యలు సగటు మనిషికి కోపం తెప్పించేలా ఉంటాయి. అలాంటి చర్యనే తాజాగా ప్రముఖ గాయకుడు రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయాడు. పాకిస్తాన్‌కు చెందిన పాపులర్ సెలబ్రిటీ సింగర్ రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ గురించి తెలిసిందే. పాకిస్తాన్‌లో కాకుండా ఆయనకు ఇండియాలో సైతం అభిమానులు ఉన్నారు.

అనేక హిందీ చిత్రాల్లో అద్భుతమైన సాంగ్స్ పాడి సూపర్ పాపులర్ అయ్యాడు రాహత్ ఫతేహ్ అలీ ఖాన్. ఆయన పాడిన ఎన్నో పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అలాంటి సింగర్ రాహత్ అలీ ఖాన్ తాజాగా చేసిన చర్యపై నెటిజన్స్ మండిపడుతున్నారు. 49 ఏళ్ల రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ తన శిష్యుడిని చెప్పుతో కొడుతున్న వ...