భారతదేశం, ఫిబ్రవరి 12 -- టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నాడు కే రాఘ‌వేంద్ర‌రావు. ఎన్టీఆర్, కృష్ణ వంటి అల‌నాటి స్టార్లు మొద‌లుకొని... చిరంజీవి, వెంక‌టేష్, నాగార్జున నుంచి నేటి త‌ర‌ హీరోలు మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్ వ‌ర‌కు మూడు త‌రాల హీరోల‌తో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాలు చేశారు. ఫాంట‌సీ, రొమాన్స్‌, డివోష‌న‌ల్ ఇలా..ఆయ‌న ట‌చ్ చేయ‌ని జాన‌ర్ లేదు.

రాఘ‌వేంద్ర‌రావు వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ ఆయ‌న త‌న‌యుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా సినిమాలు చేశాడు. కానీ అవేవి ఆయ‌న‌కు విజ‌యాల‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటోన్నాడు.

నీతో మూవీతో ప్ర‌కాష్ కోవెల‌మూడి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాకు జాన్ మ‌హేంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ల‌వ్ ఎంట‌...