Hyderabad, ఏప్రిల్ 3 -- Raghavendra Rao On Catherine Tresa In Fani Launch: టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య తెరకెక్కిస్తోన్న గ్లోబల్ మూవీ "ఫణి". ఈ థ్రిల్లర్ సినిమాను ఓఎంజీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై, ఏయు అండ్ ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు.

ఫణి సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరిన్ ట్రేసా లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. అలాగే, మహేశ్ శ్రీరామ్ కీ రోల్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇతర ప్రపంచ భాషల్లో ఫణి సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఏప్రిల్ 2న హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈవెంట్‌లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా "ఫణి" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కె రాఘవేంద్రరావు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మ...