Hyderabad, ఫిబ్రవరి 4 -- Rag Mayur Became Hero And Villain In One Day: సినిమా బండి మూవీతో హీరోగా మారిన రాగ్ మయూర్ ఇటీవల ఒకేరోజు హీరోగా విలన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'సివరపల్లి' అనే వెబ్ సిరీస్‌లో రాగ్ మయూర్ హీరో పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.

'పంచాయత్' అనే సూపర్ హిట్ హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించారు. నిజానికి ఇది రీమేక్ వెబ్ సిరీసే. కానీ, ఎక్కడా తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దర్శకనిర్మాతలు.

అమెరికా వెళ్లి పెద్ద చదువులు చదవాలి అనుకునే ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకోకుండా పంచాయతీ సెక్రటరీగా మారితే.. ఆ పల్లెటూరికి వెళ్లి ఎన్ని తిప్పలు పడ్డాడు? ఇష్టం లే...