భారతదేశం, మార్చి 6 -- Rachakonda Cyber Crime : రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (Rachakonda Cyber Crime PS) ఉత్సవ విగ్రహంలో మారింది. రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్ లో పని చేసేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చినా..... పైరవీలతో ఒక్కటి రెండు రోజుల్లోనే వేరే చోటుకు బదిలీ చేయించుకుంటున్నారు. పర్యవేక్షణ అధికారులు లేక కేసులు దర్యాప్తు అటకెక్కింది. దీంతో సైబర్ బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు.

రాచకొండ సైబర్ క్రైమ్ పీఎస్ లో డీసీపీ నుంచి కానిస్టేబుల్ వరకు దాదాపు 70 మంది సిబ్బంది ఉంటారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పోలీస్ శాఖలో బదిలీల క్రమంలో అప్పటి మహిళా డీఎస్పీ వేరే చోటకు బదిలీ అయ్యారు. ఆ తరువాత కొన్ని నెలల పాటు ఖాళీగా...