భారతదేశం, మార్చి 8 -- ఆర్టిస్టుల ముఖాలు చూపించ‌కుండా ద‌ర్శ‌కుడు శివ‌ప్ర‌సాద్ తెర‌కెక్కిన రా రాజా మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమాలో సుగి విజ‌య్‌, మౌనిక హెలెన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

రాజా (సుగి విజ‌య్‌) ఓ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. పెద్ద‌ల‌ను ఎదురించి రాణిని (మౌనిక హెలెన్‌) ప్రేమ వివాహం చేసుకుంటాడు. కొద్ది రోజుల్లోనే వారి దాంప‌త్య జీవితం ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతుంది. రాణి ద‌య్యంగా మారి త‌న‌ను టార్చ‌ర్ పెడుతుంద‌ని, ఆమెను చంపేశాన‌ని పోలీసుల‌కు లొంగిపోతాడు రాజా.

పోలీస్ స్టేష‌న్‌లో వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తాడు. సీఐ మ‌ధుక‌ర్ అన్వేష‌ణ‌లో రాణి బ‌తికే ఉంద‌ని నిజం తెలుస్తుంది. భార్య‌ను చంపాన‌ని రాజా ఎందుకు చెప్పాడు? అత‌డిని వెంటాడుతోన్న దెయ్యం ఎవ‌రు? రాజాక...