Hyderabad, జనవరి 27 -- R Madhavan: మాధవన్ తెలుసు కదా. 1990ల చివర్లో తన నవ్వుతో ఎంతో మంది అమ్మాయిల మనసు దోచిన హీరో అతడు. ఈ మధ్యే జీ5 ఓటీటీలోకి నేరుగా వచ్చిన హిసాబ్ బరాబర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా హిందుస్థాన్ టైమ్స్ తో అతడు మాట్లాడాడు. ఓ సూపర్ హీరోకి ఉండాల్సిన లక్షణాలు తనకు లేకపోయినా తాను ఎలా 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నానో అతడు చెప్పుకొచ్చాడు.

చాలా రోజుల తర్వాత మరోసారి ఓ హిందీ మూవీలో నటించాడు మాధవన్. జీ5 ఓటీటీలో అతడు నటించిన హిసాబ్ బరాబర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా అతడు హెచ్‌టీతో మాట్లాడుతూ.. ఇన్నేళ్లుగా తాను ఇండస్ట్రీలో ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి కారణమేంటో వివరించాడు.

"నేను నా సమయాన్ని ఎక్కువగా వ్యక్తులను పరిశీలించడానికి ఉపయోగిస్తాను. అదే నేను 25 ఏళ్లయినా రాణిస్తుండటానికి కా...