భారతదేశం, జూలై 26 -- స్ప్రైట్ ఆగ్రో అనే పెన్నీ స్టాక్ శుక్రవారం నాడు 2025 క్యూ1 ఫలితాలను ప్రకటించింది. ఇది బిఎస్‌ఇ-లిస్టెడ్ స్టాక్. ఈ త్రైమాసిక ఆదాయంలో, దాదాపు రూ.240 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ స్మాల్-క్యాప్ కంపెనీ నికర లాభంలో 46% కంటే ఎక్కువ పెరుగుదలను నివేదించింది. ఈ ఫలితాలు రూ.5 లోపు ధరలో లభించే ఈ పెన్నీ స్టాక్‌పై కొనుగోలు ఆసక్తిని రేకెత్తించింది. దాంతో శుక్రవారం సెషన్ లో ఇది అప్పర్ సర్క్యూట్ కు చేరుకుంది.

బిఎస్‌ఇలో ఈ పెన్నీ స్టాక్ ఇటీవల 52 వారాల కనిష్ట స్థాయి రూ.2.07కి చేరుకుంది. సోమవారం ఈ పెన్నీ స్టాక్‌పై మరింతమంది కొనుగోలుదారులు దృష్టి సారించే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌కు చెందిన స్ప్రైట్ ఆగ్రో లిమిటెడ్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ మరియు గ్రీన్‌హౌస్ టెక్నాలజీలో ప్రత్యేకత కలిగిన వ్యవసాయ రంగంలో ప్రముఖ కంపెనీ. జూన్ 30, 2025తో ముగిసిన మొదటి...