Hyderabad, మార్చి 1 -- పీవీ సింధు గురించి తెలియని వారంటూ ఉండరు. బాడ్మింటన్ ఆటతో పాటు కొన్ని రకాల యాడ్లు, సోషల్ మీడియా పోస్టులతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా ఫిట్‌గా, అందంగా కనిపిస్తుంది. పీవీ సింధు ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండటానికి, ఆకర్షణీయమైన చర్మ సౌందర్యాన్ని మెయింటేన్ చేయడానికి ఏం తింటారు, తన ఆహారంలో ఎలాంటి ప్రొటీన్‌ను చేర్చుకుంటారు. ఏ సమయంలో ఏం తింటారు వంటి ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఫిట్‌నెస్ ప్రియులకు ఈ కుతూహలం కాస్త ఎక్కువగానే ఉంటుందనుకోండి. వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజా ఇంటర్వ్యూలో తన డైట్ సీక్రెట్‌లను రివీల్ చేసింది ఈ బ్యూటీ. అవేంటో తెలుసుకుని మీరూ ఫాలో అయిపోండి.

సింధు ఎప్పుడూ తన ఆహారంలో ప్రొటీన్ ను సమతుల్యంగా తీసుకోవడంపై దృష్టి పెడుతుందట. తనకు తగినంత ప్రోటీన్ దొరకనప్పుడు వే ప్రొటీన్(wh...