భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న తీవ్రమైన యుద్ధంపై మంగళవారం కొత్త అప్‌డేట్ వెలువడింది. ఉక్రెయిన్‌లోని ఒక ముఖ్యమైన భాగం రష్యాతో విలీనం కావాలని కోరుకుంటోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటించింది. క్రెమ్లిన్ కార్యాలయం వాదనలతో యూరోప్‌లో కలకలం రేగింది. పుతిన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య సీక్రెట్ ఒప్పందం జరిగిందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో ట్రంప్, ఉక్రెయిన్ లోని కొంతభాగం రష్యాలో విలీనం కావచ్చు అని అన్నారు.

అయితే ఆ తర్వాత తాజాగా మంగళవారం రోజున 'ఉక్రెయిన్‌లోని ఒక ముఖ్యమైన భాగం రష్యాలో విలీనం కావాలని కోరుకుంటోంది' అని క్రెమ్లిన్ కార్యాలయం పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వచ్చి...