భారతదేశం, ఫిబ్రవరి 9 -- భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను బద్దలుకొట్టిన 'పుష్ప 2: ది రూల్' సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ గ్లోబల్ రేంజ్‍లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ క్రమంలో మరో భాష కూడా ఓటీటీలో యాడ్ అయింది.

పుష్ప 2: ది రూల్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ముందుగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జనవరి 30న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ఈ మూవీకి అంచనాలకు తగ్గట్టే భారీ వ్యూస్ దక్కుతున్నాయి. ఇండియాలో టాప్-1లో ఉన్న పుష్ప 2 గ్లోబల్ రేంజ్‍లోనూ ముందు నుంచి టాప్-10లో ట్రెండ్ అవుతోంది....