భారతదేశం, జనవరి 28 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా అనేక బాక్సాఫీస్ రికార్డును బద్దలుకొట్టింది. భారీ కలెక్షన్లతో దుమ్మురేపేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తన స్వాగ్, స్టైల్, యాక్షన్‍తో అల్లు అర్జున్ మరోసారి అదరగొట్టారు. దీంతో డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన పుష్ప 2కు ఆరంభం నుంచే భారీ కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు ఓటీటీలోకి పుష్ప 2 మూవీ ఈవారమే వచ్చేస్తోంది.

పుష్ప 2 సినిమా మరో రెండు రోజుల్లో జనవరి 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికి ఈ నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు వస్తుందని నెట్‍ఫ్లిక్స్ కూడా పోస్ట్ చేసింది. దీంతో హిందీ ప్రేక్షకులకు నిర...