భారతదేశం, ఫిబ్రవరి 5 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించగా.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపేస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ యాక్షన్ మూవీ భారీ హైప్ మధ్య గత డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్‍తో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టి.. అనేక రికార్డులను చెరిపేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ పుష్ప 2 హవా చూపిస్తోంది. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

పుష్ప 2 సినిమా జనవరి 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇండియాలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో టాప్‍లో ఉన్న ఈ చిత్రం గ్లోబల్ రేంజ్‍లోనూ టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ పెట్టుకొని మరీ ఈ చిత్రాన్ని చాలా మంది హాలీవుడ్ ప్రే...