భారతదేశం, జనవరి 29 -- పుష్ప 2: ది రూల్ చిత్రం బాక్సాఫీస్‍ను ఏలేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ సీక్వెల్ మూవీ బంపర్ వసూళ్లతో అదరగొట్టింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల డిసెంబర్ 5న రిలీజై చాలా రికార్డులను క్రియేట్ చేసింది. ఇటీవలే రీలోడెడ్ వెర్షన్ కూడా వచ్చింది. ఇది కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ బ్లాక్‍బస్టర్ పష్ప 2 ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు రానుండగా.. ప్రేక్షకుల్లో ఎగ్జైట్‍మెంట్ పెరిగిపోయింది.

పుష్ప 2: ది రూల్ చిత్రం రేపు (జనవరి 30) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే ఆ అర్ధరాత్రే అందుబాటులోకి వస్తుంది. దీంతో మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేయవచ్చు. రీలోడెడ్ వెర్షన్ తీసుకొస్తున్నట్టు నెట్‍ఫ్లిక్స్ ఇప్పట...