భారతదేశం, జనవరి 30 -- అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప 2 మూవీ గురువారం ఓటీటీలోకి వ‌చ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ రిలీజైంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ వెర్ష‌న్స్ మాత్ర‌మే విడుద‌ల‌య్యాయి. క‌న్న‌డ వెర్ష‌న్‌ను త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది.

థియేట‌ర్ల‌లో పోలిస్తే ఓటీటీలో పుష్ప ర‌న్‌టైమ్ 23 నిమిషాలు పెరిగింది. లెంగ్త్ ఎక్కువ‌నే కార‌ణంగా ఎడిటింగ్‌లో క‌ట్ చేసిన ప‌లు సీన్స్‌ను ఓటీటీ వెర్ష‌న్ లో యాడ్ చేశారు. థియేట‌ర్ల‌లో ఈ మూవీ మూడు గంట‌ల ఇర‌వై నిమిషాల ర‌న్‌టైమ్‌తో రిలీజైంది. ఓటీటీలో మాత్రం మూడు గంట‌ల న‌ల‌భై నాలుగు నిమిషాల లెంగ్త్‌తో పుష్ప 2ను రిలీజ్ చేసిన‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. కొత్తగా ఓటీటీలో యాడ్ చేసిన సీన్లు ఎవ‌న్న‌ది ఓటీటీ ఫ్యాన్స్‌లో ఆస‌క్తిక‌రంగా మారి...