Hyderabad, ఫిబ్రవరి 5 -- Pushpa 2 on Netflix: పుష్ప 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూసిన ఫ్యాన్స్.. ఆ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టగానే ఎగబడి చూసేస్తున్నారు. జనవరి 30న ఈ మూవీ ఓటీటీలోకి రాగా.. మొదటి నాలుగు రోజుల్లోనే 5.8 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో రెండో స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ పుష్ప 2 మూవీ డిజిటల్ హక్కులను ఏకంగా రూ.250 కోట్లకు కొనుగోలు చేసిందన్న విషయం తెలుసు కదా. ఆ అంచనాలను తగినట్లే ఈ సినిమా ఆ ఓటీటీలో దూసుకెళ్తోంది. తొలి నాలుగు రోజుల్లోనే 5.8 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అది కూడా కేవలం తెలుగు వెర్షనే కావడం విశేషం.

పుష్ప 2 తెలుగు వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ లో నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో రెండో స్థానంలో ఉంది. ఇక ...