భారతదేశం, ఫిబ్రవరి 17 -- పంజాబ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో చీఫ్ డైరెక్టర్ బాధ్యతల నుండి వరీందర్ కుమార్‌ను తప్పించింది. ఆయనను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేసింది. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ప్రొవిజనింగ్) జి.నాగేశ్వరరావును విజిలెన్స్ బ్యూరో కొత్త చీఫ్ డైరెక్టర్‌గా నియమించింది ప్రభుత్వం. వరీందర్ కుమార్‌ను చీఫ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి.. డీజీపీ కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించారు.

ఈ ఆకస్మిక చర్య అధికార వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. వరీందర్ కుమార్ తొలగింపుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అవినీతిని ఏమాత్రం సహించకూడదని, అందరు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఈ మార్పుపై ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి.

1993 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ పోలీస్ స...