Hyderabad, మార్చి 23 -- శరీరం సరైన మొత్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు డయాబెటిస్ సమస్య మొదలవుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు ఆహారాన్ని ఆచితూచి మాత్రమే తీసుకోవాలి. కానీ, గుమ్మడి గింజల విషయంలో అలా కాదట. ప్రశాంతంగా కావాల్సినంత మేర లాగించేయొచ్చట. ఎందుకంటే, గుమ్మడి గింజల్లో డయాబెటిస్ ను నియంత్రించే గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సీజనల్ స్నాక్ గానే కాకుండా వీటిల్లో ఉండే పోషకాల కారణంగా పూర్తి ఆరోగ్యవంతులుగా కూడా ఉండొచ్చట.

ఇంత చిన్నగింజలు బ్యాలెన్స్‌డ్ లైఫ్‌స్టైల్‌తో పాటు ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఇంకా ఇవి డయాబెటిస్‌తో పోరాడేందుకు తోడ్పడతాయట కూడా. అదెలాగో తెలుసుకుందాం రండి.

కాస్త తియ్యగా అనిపించే గుమ్మడి గింజలు సైజు విషయంలో చాలా చిన్నగా ఉంటాయి. వీటిని వేయించుకుని, ఉప్పు కలుపుకుని ఎండబెట్టుకుని పలు రకాలుగా తీసుకోవచ్చు. గుమ్మడి గింజల్లో ఆరోగ...