Hyderabad, ఫిబ్రవరి 2 -- గుమ్మడికాయ తినడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడికాయలే కాదు, గుమ్మడి ఆకులు కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయట. ముఖ్యంగా ఆడవారిలో వచ్చే అనేక సమస్యలను నయం చేయగలిగే శక్తి గుమ్మడి ఆకుల్లో ఉంటుందట. గుమ్మడికాయ ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు, బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా కాల్షియం, మాంగనీస్, విటమిన్ B6, ఫాస్ఫరస్ వంటి వాటితో నిండి ఉంటాయి గుమ్మడి ఆకులు. వీటిలోని పోషకాలు శారీరక, మానసిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. గుమ్మడికాయ ఆకులు తినడం వల్ల మహిళల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ (PMS) ఇప్పుడు చాలా మంది మహిళలకు పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యతో బాధపడే మహిళలు మానసిక మార్...