భారతదేశం, ఫిబ్రవరి 10 -- Psychology Courses: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిసారి క్లినికల్ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు ఏపీలో క్లినికల్ సైకాలజీ కోర్సులు అందుబాటులో లేవు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ మ‌రియు చికిత్స అందించ‌డంలో క్లినికల్ సైకాలజిస్టులు కీల‌క పాత్ర వ‌హిస్తారని, వారి అవసరాన్ని గుర్తించి క్లినికల్ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభిస్తున్నట్టు మంత్రి సత్యకుమార్ వివరించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి సారిగా క్లినిక‌ల్ సైకాల‌జీ కోర్సుల్ని ప్రారంభించ‌నున్నామ‌ని తెలియ‌జేయ‌డానికి సంతోషిస్తున్నట్టు తెలిపారు. వైద్య రంగానికి ఎంతో ముఖ్య‌మైన ఈ కోర్సులు రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌వేశ పెట్ట‌క‌పోవ‌డం దుర‌దృష్టమన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర...