భారతదేశం, జనవరి 11 -- ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(SHAR)లో ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. PSLV-C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మధ్యాహ్నం 12:17 గంటలకు మెుదలైంది. మొత్తం 22 గంటల పాటు కొనసాగుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలు PSLV-C62 రాకెట్ ఉపయోగించి 'అన్వేషణ్' అని నామకరణం చేసిన EOS N1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఈ మిషన్ ద్వారా ఎనిమిది విదేశీ, ఏడు స్వదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. 'అన్వేషణ్' ఉపగ్రహం భూమి పరిశీలన కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. రక్షణ రంగానికి అవసరమైన డేటాను అందించడం, వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం, తుపానులు, వరదలు వంటి ప్రకృతి వ...