భారతదేశం, ఫిబ్రవరి 15 -- లావా సబ్ బ్రాండ్ అయిన "ప్రోవాచ్".. తన తొలి ఎక్స్-సిరీస్ స్మార్ట్​వాచ్​ని తాజాలా లాంచ్​ చేసిది. దీని పేరు ప్రోవాచ్​ ఎక్స్​. ఇందులో ఇన్ -బిల్ట్ జీపీఎస్, బ్లూటూత్ కాలింగ్​ సహా మరెన్నో కూల్​ ఫీచర్స్​ ఉన్నాయి. రూ.5,000 లోపు బడ్జెట్​లో హెల్త్ ట్రాకింగ్, నావిగేషన్, యాక్టివిటీ మానిటరింగ్ వంటి ఫీచర్స్​తో ఒక మంచి స్మార్ట్​వాచ్​ కొనాలని ప్లాన్​ చేస్తున్న వారు ప్రోవాచ్​ ఎక్స్​ కొనుగోలు చేయాలని సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

లావా ప్రోవాచ్ ఎక్స్​లో 1.43 ఇంచ్​ 30 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 466x466 పిక్సెల్స్ రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్​నెస్ వంటివి ఉన్నాయి. ఈ వాచ్ ఆల్వేస్-ఆన్-డిస్​ప్లే (ఏఓడీ) పనితీరును కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ఈ గ్...