Hyderabad, మార్చి 29 -- ప్రోటీన్ మన శరీరానికి చాలా అవసరం. మనం రోజూ తినే ఆహారంలో శరీరానికి కావలసినంత ప్రోటీన్ ఉండటం చాలా ముఖ్యం. కానీ చాలా మంది రోజువారి ప్రోటీన్ తీసుకోవడం గురించి గందరగోళంలో ఉంటారు. దీనివ్లల ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడతారు. ప్రొటీన్ లోపం వల్ల బలహీనత, అలసటతో పాటు జుట్టు రాలడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కండరాల బలహీనత పెరిగి నీరసం వంటి లక్షణాలు తరచూ కనిపిస్తాయి. ప్రొటీన్ లోపం రోగనిరోధశక శక్తిని కూడా తగ్గించి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. శరీరంలో ముఖ్యంగా కళ్లు, చేతులు వంటి ముఖం వంటి భాగాల్లో వాపు వస్తుంది.

వీటన్నింటిని నుంచీ తప్పంచుకోవాలంటే ప్రోటీన్ లోపాన్ని తగ్గించుకోవాలి. ఇందుకోసం సప్లిమెంట్లకు బదులుగా ప్రొటీన్లతో నిండిన ఆహారాలను తరచూ తినడం మంచిది. ప్రొటీన్ లోపాన్ని తగ్గించుకోవడానికి చాలా రకాల ఆహార పదార్థాలున్నప...