Hyderabad, ఫిబ్రవరి 13 -- శరీరం పనితీరు సజావుగా సాగాలంటే దానికి తగ్గట్లుగా సరైన పోషకాహారం అందాలి. వాటిలో ప్రధానమైనది ప్రోటీన్, ఇది ఒక రకమైన మాక్రోన్యూట్రియంట్. కండరాలను బలపరచడం, కణజాలాలను మరమ్మత్తు చేయడం, శరీరాన్ని అభివృద్ధి చేయడం వంటి ప్రముఖమైన పనులకు ప్రోటీన్ చాలా ముఖ్యం. అటువంటి మంచి ప్రోటీన్ అందించే ఆహారాలలో ప్రధానంగా మాట్లాడేది చికెన్, గుడ్లు, చేపలు. ఇవన్నీ నాన్ వెజ్ ఆహారాలు కదా. కానీ, మరి శాఖాహారులు కూడా ప్రొటీన్ ఆహారాన్ని తీసుకోవాలనుకుంటే, ఎక్కువ మొత్తంలో ప్రొటీన్ పొందే కూరగాయలు తీసుకోవాల్సిందే. చికెన్ కంటే ఎక్కువ స్థాయిలో ప్రొటీన్ అవసరాలు తీర్చగల కూరగాయలేంటో తెలుసుకుందామా..

మంచి శాఖాహార ప్రోటీన్ సోర్స్ గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తొచ్చేది సోయాబీన్. 100 గ్రాముల సోయాబీన్‌లో దాదాపు 29 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. అంటే, ఇది చికెన్‌...