భారతదేశం, ఫిబ్రవరి 21 -- పిల్లలకు మార్కెట్లో దొరికే ప్రొటీన్ పౌడర్లు ఇస్తున్నారా? "మరేం చేస్తాం, ఫ్లేవర్ లేని పాలు పిల్లలు తాగడానికి ఇష్టపడరు. పాలు పట్టించాలంటే ఏదో ఒక మాయ చేయాల్సిందే" అని ఫీలవుతున్నారా? చిన్నారుల ఆరోగ్యం కోసమే ఈ ప్రయత్నం చేసినా, అంతర్లీనంగా ఇవి హానికరమైనవనే భావన మీలో కలుగుతూనే ఉంటుంది. ఇదే సందేహంలో ఉంటూ, పిల్లలకు ఎన్ని రోజులు మాత్రం అవే కెమికల్స్ ఇవ్వగలరు? ఇంట్లోనే సహజమైన రీతిలో తయారుచేసుకోగల ప్రొటీన్ పౌడర్ ను ఒకసారి ట్రై చేయండి. పిల్లలు మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు.

మెదడుకు మంచినిరోధకత: బాదంపప్పులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి చిన్నారుల అభివృద్ధికి ఎంతో అవసరం.

శక్తి పెరుగుదల: బాదంపప్పులో ఉన్న ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ (ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం) చిన్న...