Hyderabad, ఫిబ్రవరి 14 -- రోజూ పని చేసుకునే ఆఫీసులో మనల్ని అందరూ గౌరవించాలనుకుంటాం. అందరూ మనల్ని మెచ్చుకోవాలని కోరుకుంటాం. కానీ, అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. ఏ కొందరికో మాత్రమే ఇలా గౌరవం దక్కుతుంది. అలా మర్యాద దక్కించుకోవాలంటే, ఏం చేయాలి? అందరి నుంచి ప్రశంసలు అందుకునే అధికారి కావాలనుకుంటే ఎలాంటి అలవాట్లు చాలా అవసరం. మర్యాదగల ఉద్యోగిగా కనిపించాలనుకునే ప్రతి ఒక్కరి కోసం ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. నీతిమంతులుగా ఉండటం నుండి అద్భుతంగా మాట్లాడటం వరకు మీరు నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను ఇక్కడ చర్చిద్దాం రండి. మిగతా వారికంటే మిమ్మల్ని ప్రత్యేకంగా చూపించడానికి సహాయపడే విషయాలు ఏంటో గమనించి ఆచరించే ప్రయత్నం చేయండి.

నిజాయితీగా, నీతిమంతులుగా ఉండటం మీ వృత్తి, వ్యక్తిగత జీవితం రెండింటికీ చాలా ముఖ్యం. దీని కోసం మీరు అద్భుతమైన నైతికతను కలిగి ఉండాలి...