భారతదేశం, ఫిబ్రవరి 17 -- బేబి సినిమాతో 2023లో భారీ బ్లాక్‍బస్టర్ కొట్టారు నిర్మాత ఎస్‍కేఎన్ (శ్రీనివాస్ కుమార్). ఆనంద్ దేవరకొండ, తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన ఆ మూవీ భారీ హిట్ అయింది. కల్ట్ ప్రొడ్యూజర్ అంటూ ఎస్‍కేఎన్ పేరు తెచ్చుకున్నారు. తాజాగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఎస్‍కేఎన్ వివాదాస్పదన వ్యాఖ్యలు చేశారు. తెలుగు హీరోయిన్లుపై షాకింగ్ కామెంట్ చేశారు. ఏమన్నారంటే..

తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే తనకు ఏం జరుగుతుందో తెలిసి వచ్చిందని ఎస్‍కేఎన్ అన్నారు. " తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే.. తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు తర్వాత తెలిసింది. అందుకని తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ కల్ట్...