భారతదేశం, ఫిబ్రవరి 7 -- Producer SKN About True Lover Movie: ప్రతి రోజు పండగే, ట్యాక్సీ వాలా, బేబి వంటి బ్లాక్ బస్టర్, కల్ట్ సినిమాలతో టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు ఎస్‌కేఎన్. ఆయన తన స్నేహితుడు, డైరెక్టర్ మారుతితో కలిసి తమిళ సినిమా లవర్‌ను తెలుగులో ట్రూ లవర్ టైటిల్‌తో తీసుకొస్తున్నారు. ఇందులో గుడ్ నైట్ మూవీ హీరో మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

ట్రూ లవర్ చిత్రాన్ని మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. విభిన్న ప్రేమ కథతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ తెరకెక్కించారు. ట్రూ లవర్ సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాలోని హైలైట్స్, ఈగల్‌తో పోటీపై...