Hyderabad, ఫిబ్రవరి 5 -- Producer Ramesh Babu: శింగనమల రమేష్ బాబు.. టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్లలో ఒకడు. శ్రీ కనకరత్న మూవీస్ బ్యానర్లో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లతో ఖలేజా, కొమురం పులి, తమిళంలో విజయ్ తో పోకిరిలాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీశాడు. అయితే వీటిలో పులి, ఖలేజా సినిమాల వల్ల తాను రూ.100 కోట్లు నష్టపోయానని చెప్పాడు. బుధవారం (ఫిబ్రవరి 5) రమేష్ బాబు 14 ఏళ్ల కిందటి కేసులో నాంపల్లి కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు.

టాలీవుడ్ ప్రొడ్యూసర్ శింగనమల రమేష్ బాబు బుధవారం (ఫిబ్రవరి 5) మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆ రెండు సినిమాలు ఆలస్యం కావడం, దానివల్ల జరిగిన నష్టం, ఆ మూవీస్ లోని హీరోలు సపోర్ట్ ఇచ్చారా లేదా అన్న ప్రశ్నపై స్పందించాడు.

"ఈకాలంలో రాజమౌళి సినిమాలు, పుష్ప 2లాంటి సినిమాలు పూర్తవడానికి మూడేళ్లు, నాలుగేళ్...