భారతదేశం, ఫిబ్రవరి 3 -- Producer KP Chowdary : సినీ నిర్మాత, డ్రగ్స్ కేసులో పట్టుబడిన కృష్ణ ప్రసాద్ చౌదరి(కేపీ చౌదరి) ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక కారాణాలు సూసైడ్ కు కారణాలు కావొచ్చని ఆయన సంబంధీకులు అంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినీరంగంలోకి వచ్చారు. కబాలి సినిమాకు తెలుగులో నిర్మాతగా వ్యవహరించారు. 2023లో ఆయన దగ్గర 93 గ్రా. డ్రగ్స్ దొరకడంతో పోలీసులు అరెస్టు చేశారు.

కృష్ణప్రసాద్‌ చౌదరి 2016లో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన కబాలి మూవీ తెలుగు వర్షన్‌కు నిర్మాతగా వ్యవహరించారు. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా పనిచేశారు. సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌, అర్జున్‌ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు....