Hyderabad, మార్చి 22 -- Producer Rahul Reddy About Tuk Tuk Movie: ఫాంటసీ, మ్యాజికల్‌ అంశాలతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రిలీజ్ అయిన చిత్రం 'టుక్‌ టుక్‌'. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి. సుప్రీత్‌ కృష్ణ దర్శకత్వం వహించారు.

మార్చి 21న టుక్ టుక్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు రెస్పాన్స్ బాగానే ఉంది. అయితే, టుక్ టుక్ రిలీజ్ డేట్‌కు ముందు ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ పాల్గొంది. ఓ ఇంటర్వ్యూలో టుక్ టుక్ మూవీ నిర్మాత రాహుల్ రెడ్డి మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

-ఐటీ మల్టీపుల్‌ కంపెనీలో పనిచేస్తుండేవాడిని. ఆ తరువాత యానిమేషన్‌ స్టూడియో స్టార్ట్‌ చేశాను. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయమైన దర్శకుడు సుప్రీత...