భారతదేశం, ఏప్రిల్ 28 -- Priyadarshi: కమెడియన్‍గా ప్రియదర్శి చాలా ఫేమస్ అయ్యారు. కామెడీ టైమింగ్‍తో అందరినీ ఆకట్టుంటున్నారు. పెళ్లి చూపులు చిత్రం నుంచి తాజాగా వచ్చిన ఓం భీమ్ బుష్ వరకు చాలా సినిమాల్లో కమెడియన్‍‍గా, సపోర్టింగ్ పాత్రల్లో ప్రియదర్శి మెప్పించారు. ఈ క్రమంలో 2019లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో మల్లేశం చిత్రం వచ్చింది. తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో.. కామెడీనే కాకుండా తాను ఎమోషనల్ క్యారెక్టర్లు కూడా చేయగలనని ఆ చిత్రంతో ప్రియదర్శి నిరూపించారు. 2023లో ప్రియదర్శి హీరోగా బలగం వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. జాతిరత్నాలులోనూ మెయిన్ రోల్ చేశారు. మరోవైపు కమెడియన్‍గా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు ప్రియదర్శి. అయితే, ఆయనకు హీరోగా అవకాశాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ప్రియదర్శి హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు లైనప్‍లో ఉన్నాయి.

ప్రియదర్శి హీరోగా డార్లింగ్ చిత...