Hyderabad, మార్చి 9 -- Priyadarshi About Court State Vs A Nobody Movie: పెళ్లి చూపులు సినిమాలో కమెడియన్‌గా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను మన్ననలు పొందాడు కమెడియన్ ప్రియదర్శి. మల్లేశం సినిమాతో హీరోగా మారి మొదటి చిత్రంతోనే మంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఆ తర్వాత బలగం వంటి సూపర్ హిట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో మరింతగా కట్టిపడేశాడు ప్రియదర్శి. ఓవైపు కమెడియన్‌గా ప్రేక్షకులను నవ్విస్తూనే మల్లేశం, బలగం, డార్లింగ్ వంటి సినిమాలతో హీరోగా మెప్పించాడు. ఇప్పుడు ప్రియదర్శి మరోసారి ప్రధాన పాత్రలో నటించిన సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని సమర్పించిన కోర్ట్ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ చిత్రం మార్చి 14న హోలీ పండుగసందర్భంగా విడుదల కాన...