Hyderabad, ఫిబ్రవరి 23 -- Priyadarshi About Telugu Cinema In Court Press Meet: కమెడియన్‌గా సినీ కెరీర్ ఆరంభించి మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రియదర్శి. అనంతరం బలగం, డార్లింగ్ వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇప్పుడు ప్రియదర్శి నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ.

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ కోర్ట్ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నాడు. అలాగే, 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఏ నోబడీ' సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా ఉన్నారు.

కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ సినిమాను మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోర్ట్ ప్రెస్ మీట్‌కు హీరో నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అలాగే...